Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగంలోకి దిగిన చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రెంట్

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆయన పలువురు జాతీయ స్థాయి నేతలతో మాట్లాడుతున్నారు.

Advertiesment
రంగంలోకి దిగిన చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రెంట్
, శుక్రవారం, 16 మార్చి 2018 (09:37 IST)
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆయన పలువురు జాతీయ స్థాయి నేతలతో మాట్లాడుతున్నారు. పైగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలత కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా ఆయన మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. 
 
ఈ మేరకు జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా రిపబ్లిక్‌ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇప్పటికే 7 పార్టీలు టీడీపీకి మద్దతు ప్రకటించాయని, మేలో చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారని పేర్కొంది. అఖిలేశ్‌ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ)తో మాట్లాడాక.. ఎన్డీయే నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. ఆ ప్రకారంగానే శుక్రవారం ఉదయం చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 
 
ఇకపోతే, జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించడంపై తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంకేతాలు పంపారని, టీఎంసీ అధినేత్రి మమత కూడా ఈ దిశన ప్రయత్నాలు ప్రారంభించారని గుర్తుచేసింది. ఫెడరల్‌ ప్రంట్‌పై పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎంపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కూటమి అంటూ ఏర్పడితే చంద్రబాబు తప్ప సారథ్యం వహించగల నాయకుడు మరొకరు లేరని, గతంలోనూ ఇలాంటి కూటమిని విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్డీయేతో కటీఫ్ : అవిశ్వాసం పెట్టాల్సిందిగా చంద్రబాబు ఆదేశం