Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (11:01 IST)
ప్రభుత్వ సర్వీసులో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్‌బాబుకు బెయిల్ లభించింది. 
 
2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇద్దరి పూచీకత్తు, 40వేల రూపాయల డిపాజిట్‌తో 2వ ఏసీఎంఎం న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్‌ విధించిన తర్వాత బెయిల్‌ మంజూరు చేసింది. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఐడీ చరిత్రలో చిన్న నేరంపై ఏడు కేసులు పెట్టారని అన్నారు. సీఐడీ అధికారులు సమ్మెపై విచారించారని…తనపై పెట్టిన కేసు గురించి తక్కువగా మాట్లాడారన్నారు. తనపై కక్షపూరితమైన చర్యలు ఆపాలన్నారు. 
 
ఉద్యోగ సంఘాల సమ్మెలో తన పాత్ర లేదని, వారు కోరితే మద్దతిస్తామని చెప్పామన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగిస్తే ప్రభుత్వం కనుమరుగవడం ఖాయమని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments