Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలుగొండ ప్రాజెక్టును గెజెట్ లో చేర్చండి, కేంద్ర మంత్రికి టీడీపీ విన‌తి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:39 IST)
కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వెలుగొండ ప్రాజెక్ట్ ను త‌మ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని, దానికి గెజెట్ నోటిఫికేష‌న్ చేయాల‌ని టీడీపీ నాయ‌కులు విజ్ణ్న‌ప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. ప్రకాశం,  నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు, మాజీ శాసనసభ్యలు, నాయకుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిశారు. వెలుగొండ ప్రాజెక్టు సమస్యపై కేంద్ర మంత్రిని కలిసిన బృందం అక్క‌డి సాధ‌క‌బాధ‌కాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. 
 
వెలుగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బృందం అక్క‌డి ప‌రిస్థితిని వివ‌రిస్తూ, ప్రకాశం జిల్లా కరువు పరిస్థితిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి తెలిపింది. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార‌ని తెదేపా బృందం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments