Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాలు - తెదేపా సభ్యుల సస్పెన్షన్

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మూడో రోజైన సోమవారం రోజున సభలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి ప్రధాన కారణం గత తెలుగుదేశం పార్టీయేనని వైకాపా నేతలు ఆరోపించారు. దీన్ని టీడీపీ సభ్యులు తిప్పికొట్టారు. దీంతో సభలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. దీంతో మార్చల్స్ వచ్చి తెదేపా సభ్యులను బయటకు తీసుకెళ్ళారు. 
 
పోలవరం ప్రాజెక్టుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో రాష్ట్ర జలవనరులు శాఖామంత్రి అంబటి రాంబాబు ప్రసంగించారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ, తెదేపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం జాప్యానికి కారణం టీడీపీయేనని ఆయన ఆరోపించారు. 
 
ఈ చర్చ సందర్భంగా తమ పార్టీపై అకారణంగా విమర్శలు గుప్పిస్తున్నారంటూ తెదేపా సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే, సీఎ జగన్ ప్రసంగానికి అడ్డు తగిలారు. వారిని స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు వారించినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ సభ్యులను స్పకర్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments