Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్.. ముందు సర్పంచ్‌గా గెలువు.. మా జాతకాలు తర్వాత : మంత్రి రోజా

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (15:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి ఆర్కే.రోజా గట్టి కౌంటరిచ్చారు. మిస్టర్ పవన్.. ముందు మీరు సర్పంచ్‌గా గెలువు అంటూ సలహా ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని నీవు కూడా మా జాతకాలు చెబుతుంటే నవ్వొస్తుంది అంటూ హాస్యోక్తులు విసిరారు. జనసేన పార్టీ న్యాయ విభాగం విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలో జరిగింది. 
 
ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. పనిలోపనిగా ఆయన వైకాపా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 46 నుంచి 60 సీట్లకు మించి రావంటూ జోస్యం చెప్పారు. దీనిపై ఏపీ మంత్రి ఆర్.కె.రోజా సోమవారం గట్టిగా కౌంటరిచ్చారు. 
 
ఎమ్మెల్యేగా గెలవలేని న్వువు మా జాతకం చెబుతుంటే నవ్వొస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. మాకు 45 సీట్లు వస్తే మిగిలిన 130 సీట్లు మీకు వస్తాయా? అంటూ ప్రశ్నించారు. ముందు సర్పంచ్‌గా గెలవండి. ఆ తర్వాత ఎమ్మెల్యే గురించి ఆలోచించవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. 
 
అస్సలు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీకి అభ్యర్థులు ఉన్నారా? అంటూ ఆమె నిలదీశారు. జగన్ సీఎఁ కాడు.. ఇదే నా శాపం అన్నావు.. శాసనం అన్నవాడ్ని శాసనసభలోకి కూడా రానివ్వడం లేదు ఈ విషయం మర్చిపోయావా? అంటూ ప్రశ్నించారు. 
 
గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీ చేశారన్న రోజా.. చిరంజీవి కూడా  పార్టీ పెట్టి ఒంటరిగానే పోటీ చేశారని గుర్తుచేశారు. అదే రక్తం పంచుకుని పుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టావే గానీ, ఒంటరిగా ఎన్నికలకు వెళ్లావా? అని నిలదీశారు. 

సంబంధిత వార్తలు

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments