Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (07:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కె. అచ్చెన్నాయుడుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే, ఆయనకున్న అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఏపీ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
నిజానికి ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగా, ఆయనను విజయవాడకు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచడంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. 
 
కోర్టు ఆదేశాలతో పోలీసులు తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారుల అనుమతితో గుంటూరు జీజీహెచ్‌కు తరలించనున్నారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేశ్ కుమార్‌ను రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు.
 
ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందు కొనుగోళ్లలో అవకతవకలు సంబంధించిన కేసులో అచ్చెన్నాయుడిని శుక్రవారం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. 
 
మాజీ మంత్రితోపాటు ఈ కేసులో ఏ1 నిందితుడైన రమేశ్ కుమార్‌ను కూడా అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వాదనల అనంతరం అచ్చెన్నాయుడు, రమేశ్ కుమార్‌లకు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments