Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అందుకే: రోజా విమర్శలు

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:19 IST)
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధాని మార్పు చేపడుతుండటం ఎపిలో నూతన అధ్యాయానికి నాంది అన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. రాష్ట్రప్రజలపై ఏమాత్రం చంద్రబాబునాయుడు ప్రేమ ఉన్నా వెంటనే బిల్లుపై రాద్దాంతం చేయడం మానుకోవాలన్నారు. గవర్నర్ సిఆర్డీఎ బిల్లును రద్దు చేస్తూ వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంపై చిత్తూరు జిల్లా నగరిలో సంబరాలు చేసుకున్నారు.
 
నగరిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన రోజా సిఎం నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. అమరావతిలో భూములు కొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని, అయితే రాజధాని తరలింపుతో వారి భూములు నష్టపోతుండటంతో ఆ సామాజిక వర్గ రైతులను రెచ్చగొట్టి రచ్చరచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
కర్నూలులో న్యాయ రాజధానితో రాయలసీమ ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారని, ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోందని చెప్పారు రోజా. సామాజిక దూరం పాటిస్తూ సంబరాల్లో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments