Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు చెవిలో జోరీగలా మోగినా ఫలితమేదీ... పుండు మీద కారం చల్లుతున్న జె.సి

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (20:09 IST)
తెలుగుదేశం పార్టీ నేతలు ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకుండా బాధపడుతుంటే పుండు మీద కారం చల్లినట్లుగా జె.సి.దివాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. భారీ మెజారిటీతో అధికారాన్ని వైసిపి కైవసం చేసుకున్న తరువాత అసలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు టిడిపి నాయకులు, కార్యకర్తలు. అయితే జె.సి. దివాకర్ రెడ్డి మాత్రం అనంతపురం నుంచి ఏవేవో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నారు.
 
ముఖ్యంగా జె.సి.దివాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపుతున్నాయి. టిడిపి నేతలకు ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. నేను ఎన్నికలకు ముందే చెప్పాను. చంద్రబాబుకు చెవిలో జోరీగాలా విన్నవించుకున్నాను. అయినా చంద్రబాబులో మార్పు మాత్రం రాలేదు. ఎన్నిసార్లు చెప్పాలి. 
 
మన నేతల్లో మార్పు రావాలి.. మనకన్నా జగన్ గట్టిగా ఉన్నాడని చెప్పా. అయితే ఏమాత్రం చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి.. ఏమైంది. నేను అందుకే రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నా. ఒకటి... మనం చెప్పిందన్నా వినాలి. లేకుంటే సొంతంగానైనా ఏదో ఒకటి చేయాలి. రెండూ సరిగ్గా చేయలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు జె.సి.దివాకర్ రెడ్డి. ఇప్పుడే ఓటమితో ఎక్కడా కనిపించకుండా సైలెంట్‌గా రామా గోవిందా అంటూ ఉన్న టిడిపి నేతలకు చిర్రెత్తుకునేలా చేస్తున్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments