Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్‌కు సవాల్ విసిరిన చింతమనేని : దమ్ముంటే ఆ పని చేయించు...

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (10:26 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. ఇటీవల ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో పాటు వాహనాల కొనుగోలు అంశంపై పార్టీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. తెదేపా నేతల అరెస్టును ఖండిస్తూ చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను కూడా కూడా పోలీసుల్ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనతో పాటు.. ఆయన అనుచరులను బెయిలుపై విడుదల చేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు చింతమనేని సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తన కేసును సీబీఐకి అప్పగించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కానీ, తెదేపా నేతలకు కష్టాలు సృష్టించడమే జగన్ ఏకైక లక్ష్యంగా ఉందన్నారు. ఇదే అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments