Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోగి రమేష్ ఓ జోకర్... చంద్రబాబు జోలికొస్తే... గుడ్డలూడదీసి తంతాం : బుద్ధా వెంకన్న

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (09:10 IST)
వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌కు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న గట్టి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి వస్తే గుడ్డలూడదీసి కొడతాం అంటూ హెచ్చరించారు. పైగా జోగి రమేష్ ఓ జోకర్, బఫూన్ అంటూ వ్యాఖ్యానించారు. వడదెబ్బ తగిలి కృష్ణా జిల్లా గోపాలలో ఓ వృద్ధురాలు చనిపోయింది. పింఛన్ అందకే ఆ వృద్ధురాలు చనిపోయిందంటూ వైకాపా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, ఆ వృద్ధురాలి శవంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ధర్నాకు జోగి రమేష్ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. మంగళగిరికి చెందిన పలువురు నాయకులతో పాటు విజయవాడకు చెందిన బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, తదితరులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, జోగి రమేష్ ఓ జోకర్... ఓసారి చంద్రబాబు వద్దకు వచ్చి హడావుడి చేసినందుకే మంత్రి పదవి వచ్చింది. అప్పట్లో పోలీసుల అండతో జోగి రమేష్ రెచ్చిపోయారు. అయినా టీడీపీ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించాం. ఇపుడు మళ్లీ ఓట్ల కోసం చంద్రబాబు ఇంటికి వెళ్లాను. ధర్నా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈసారి వస్తే జోగి రమేష్ గుడ్డలూడదీసి తంతాం" అంటూ ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments