Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెన్షన్లు టీడీపీ ఆపినట్టు వైకాపా ప్రచారం చేస్తుంది... ఈసీ అభ్యంతరం చెప్పింది : చంద్రబాబు

chandrababu

ఠాగూర్

, ఆదివారం, 31 మార్చి 2024 (17:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీకి ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పిందని, తెలుగుదేశం పార్టీ కాదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని చెప్పిందన్నారు. అందువల్ల ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ మీనాలకు చంద్రబాబు లేఖ రాశారు.
 
మరోవైపు, ఏపీలో ఏప్రిల్ ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రజలకు ఊరటనిచ్చింది. పెన్షన్ల పంపిణీకి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, పెన్షన్లు అందించేందుకు వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసింది. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. 
 
ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖ రాశార. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతంరాలు తెలిపిన నేపథ్యంలో ఏపీలో పెన్షన్లు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డోర్ టు డోర్ విధానంలో పెన్షన్లు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
మరోవైపు, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్లు పంపిణీ నిలిచిపోకూడదని అన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్లు పంపిణీని పూర్తి చేయాలని ఆయన కోరారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్వానీకి భారతరత్న : ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!