Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్టింగులకు శుభవార్త చెప్పిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (08:48 IST)
తెలుగుదేశం పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వచ్చే 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అరాచక వైకాపా ప్రభుత్వంపై తమ పార్టీ ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారని, అందువల్ల వారందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత 1994లో ప్రతిపక్షంలో ఉండగా ఆ రోజున మనతో ఉన్న మొత్తం 74 మందికి టిక్కెట్లు ఇచ్చామని, వారిలో ఒక్కరు మినహా మిగిలిన వారందరూ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారని, కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆయనకు పార్టీ రాజ్యసభ స్థానం ఇచ్చి ప్రమోషన్ కల్పించిందని గుర్తుచేశారు. 
 
అధికార వైకాపా పార్టీలోని 151 మంది ఎమ్మెల్లో సగం మంది అంటే 70 మంది సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వొద్దని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ సిఫార్సు చేసిందంటూ సామాజిక మాద్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తాజాగా చేసిన ప్రకటన ఇపుడు ఆసక్తికరంగా మారింది. 
 
"వైకాపావి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. టిక్కెట్లు ఇవ్వబోమని ఎమ్మెల్యేలను జగన్ బెదిరిస్తున్నారు. టిక్కెట్లు ఇవ్వనపుడు చాకిరీ ఎందుకని అనేక మంది ఎమ్మెల్యేలు పైపైన తిరుగుతున్నారు. కానీ మన ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. వారిని అభనందిస్తూనే, వారందరికీ 2024లో ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తాం" అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments