23న రాత్రి 7 గంటలకు జగనాసుర దహనం : టీడీపీ పిలుపు

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (16:25 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి జైల్లో బంధించారంటూ టీడీపీ నేతలు, శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే శబ్దాలు చేయడం, చేతులకు సంకెళ్లు వేసుకోవడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జగనాసుర దహనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 
 
"దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దాం. అక్టోబ‌రు 23వ తేదీ విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి "సైకో పోవాలి" అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండి. ఆ వీడియో, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయండి. సైకో జ‌గ‌న్ అనే చెడుపై మంచి అనే చంద్ర‌బాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని సెల‌బ్రేట్ చేసుకుందాం" అని పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments