Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకు విదేశాల్లో ఉన్నాడు.. నీకు పిల్లవాడు ఎలా పుట్టాడు : కోడలికి అత్త ప్రశ్న

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (15:01 IST)
ఉద్యోగం కోసం నా కుమారుడు విదేశాలకు వెళ్లాడు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండే నీకు పిల్లాడు ఎలా పుట్టాడు అని కోడలిని అత్తామామలు నిలదీశారు. దీంతో ఆ కోడలు ఏం చేయాలో దిక్కుతోచక... అత్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. 
 
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాశి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెన్‌కాశి సమీపంలోని కట్టేరిపట్టి అనే గ్రామానికి చెందిన మురుగన్‌కు తెన్‌మొళి అనే మహిళతో గత ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహం జరిగిన 20 రోజుల తర్వాత మురుగన్‌ ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లడంతో తేన్‌మొళి తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో, మంళవారం ఉదయం తేన్‌మొళి ఓ పసిబిడ్డతో వచ్చి మీ మనుమడు అని చెప్పడంతో మురుగన్‌ తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు. వివాహమై 9 నెలలు గడిచింది వాస్తవమేనని, తమ కుమారుడు అప్పుడే విదేశాలకు వెళ్లగా పసిబిడ్డ ఎలా జన్మించాడని అత్తామామలు తేన్‌మొళి నిలదీసి, ఆమెను ఇంట్లోకి రానివ్వ లేదు. 
 
దీంతో, మనస్తాపం చెందిన తేన్‌మొళి, భర్తను పిలిపించి డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని, అప్పటివరకు తనను ఇంట్లో ఉండనివ్వాలంటూ పసిబిడ్డతో కలసి ఇంటి ముందు భైఠాయించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments