Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తిరుమలేశుని దయతో బ్రతుకుతున్నా, అందుకే 3 కోట్లతో శంకుచక్రాలు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:05 IST)
ఓం నమో వేంకటేశాయ. ఆ తిరుమల వేంకటేశుని దివ్యమంగళరూపం ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరనది. భక్తుల పాలిట కల్పతరువై ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ శక్తికొలది కానుకలు సమర్పించుకుంటూ వుంటారు. బుధవారం తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు భారీ కానుక సమర్పించాడు. శ్రీవారికి శంకుచక్రాలను చేయించి సమర్పించాడు.
 
వీటి విలువ సుమారు రూ .2 కోట్లు వుంటుందని అంచనా. 3.5 కిలోల బంగారంతో స్వామి కోసం శంకు, చక్రాలను తయారు చేసినట్లు తంగదొరై వెల్లడించారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఆభరణాలను సమర్పించారు.
తంగదొరై గతంలో కూడా శ్రీవారికి బంగారు, వజ్రాల ఆభరణాలను కానుకగా ఇచ్చారు. వాటిలో బంగారు వడ్డాణం, బంగారు చేతులు, హారము ఉన్నాయి. తిరుమల బాలాజీకి ఎప్పుడూ చాలా విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తూనే వుంటారు.
 
భక్తులు బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాలు, భూములను అర్పిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు నగదు రూపంలో భారీ కానుకలు ఇచ్చారు. ఆ విధంగా భక్తులు వివిధ రూపాల్లో వెంకటేశ్వరస్వామికి కానుకలు ఇవ్వడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments