Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జాతీయ రహదారిపై రివ్వుమంటూ స్విఫ్ట్ కారు, ఆపి చెక్ చేస్తే రూ. 1 కోటి

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (18:01 IST)
డబ్బులేని పేదలు పూట గడవడం కోసం నానా తిప్పలు పడుతుంటారు. కానీ కోట్లలో డబ్బు ఆర్జించేవారు మాత్రం నోట్ల కట్టలను రోడ్లపై కార్లలో అటుఇటూ తిప్పుతుంటారు. అంతా బిజినెస్ మాయ. వ్యాపారంలో ప్రభుత్వానికి లెక్క చూపకుండా చాలామంది నల్లడబ్బు వెనకేస్తుంటారు. ఆ డబ్బును దాచేందుకు నానా తంటాలు పడుతుంటారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... నెల్లూరు నుంచి స్విఫ్ట్ కారు రివ్వుమంటూ వెళ్తోంది. ఎప్పటిలాగే కార్లను తనిఖీ చేసే పోలీసులు ఆ కారును కూడా ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారు అడిగితే నరసాపురం అని చెప్పారు. కారులో బ్యాగేజ్ గురించి అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీనితో అనుమానం వచ్చిన పోలీసులు డిక్కీ ఓపెన్ చేయాలని అడిగారు. 
 
ఓపెన్ చేశాక అక్కడ చూసి పోలీసులు షాకయ్యారు. సంచి నిండుగా కరెన్సీ నోట్ల కట్టలు. ఆ డబ్బు ఎక్కడిది అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీనితో లెక్కలో లేని బ్లాక్ మనీగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డబ్బును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటుకి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments