పార్టీ ఎందుకు మారానా అని తల బాదుకుంటున్న ఎమ్మెల్యే..

వైసిపి నుంచి టిడిపిలోకి చేరారు 22 మంది ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష పార్టీలో వుండి ఏమీ చేయలేమని తెలుసుకున్న ఈ ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇందులో కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వ

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (19:43 IST)
వైసిపి నుంచి టిడిపిలోకి చేరారు 22 మంది ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష పార్టీలో వుండి ఏమీ చేయలేమని తెలుసుకున్న ఈ ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇందులో కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అందులో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు ఈయనకు చుక్కుల చూపిస్తున్నారు. భూమా కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉండటమే కాకుండా అందులో ఒకరు మంత్రిగా ఉండటం వల్ల కర్నూలు జిల్లాలో ఎస్వీ మోహన్ రెడ్డి అనుకున్న పట్టును సంపాదించలేకపోతున్నారు.
 
మోహన్ రెడ్డి వెనుక ఉన్న క్యాడర్ టిడిపిలో ఇమడలేక పార్టీలో ఒక వర్గంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తారా లేదో అన్న ఆలోచనలో పడిపోయారు మోహన్ రెడ్డి. మొదట్లో అధికార పార్టీలోకి వచ్చిన ఎస్వీ తనకు సీటు ఖాయమని చెప్పి ఇప్పుడు ఆ మాట ఎక్కడా చెప్పడం లేదు. అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన టి.జి.వెంకటేష్. తాజాగా టి.జి.వెంకటేష్‌ కుమారుడు టి.జి.భరత్ కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే టిడిపి తరపున భరత్ చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న టి.జి.వెంకటేష్‌ తన కుమారుడికి ఎలాగైనా ఆ సీటును ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. 
 
తన కుమారుడికి సీటు కోసం నారా లోకేష్‌‌తో సంప్రదింపులు చేశారట టి.జి.వెంకటేష్‌. ఇదంతా ఒక ఎత్తయితే ఎస్వీ మోహన్ రెడ్డి వెనుక ఉన్న వ్యక్తులు కూడా మెల్లమెల్లగా టి.జి.వెంకటేష్‌ చెంతకు చేరిపోతున్నారు. గత మూడురోజుల నుంచి ఐవిఆర్‌ఎస్ కాల్స్ కర్నూలు ప్రజలకు వస్తోంది. అందులో వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి ఎవరికి సీటు దక్కాలనుకుంటున్నారు అని ప్రశ్నించి టి.జి.భరత్‌కు ఇవ్వాలా లేకుంటే వై.సి.పి నుంచి వచ్చిన ఎస్వీ మోహన్ రెడ్డికి ఇవ్వాలా అని అడుగుతున్నారట. 
 
ఇది కాస్త ఆ ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదు. పార్టీలో చేరేటప్పుడు మీకు సీటు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇలా ఐవిఆర్‌ఎస్‌లో రెండు పేర్లు చెబుతున్నారేంటని తన ఆవేదనను మంత్రి అఖిలప్రియ దృష్టికి తీసుకెళ్ళారు ఎస్వీ మోహన్ రెడ్డి. ఏకంగా అధినేత కుమారుడు హామీ ఇస్తే మంత్రి మాత్రం ఏం చేయగలుగుతారు. ఇదంతా తలుచుకుని తలపట్టుకుని కూర్చున్నారట ఎస్వీ మోహన్ రెడ్డి. పార్టీ అసలెందుకు మారామా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారట ఎస్వీ మోహన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments