Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌కు అధికారాన్ని అప్పజెప్పనున్న చంద్రబాబు.. ఎలా..?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస, టీడీపీలు కలిసి పొత్తుపెట్టుకుంటే ఏపీలో అధికారాన్ని జగన్‌కు చంద్రబాబు బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. తెరాసతో టీడీపీ పొత్తు అనేది ఆత్

Advertiesment
Telangana
, ఆదివారం, 5 నవంబరు 2017 (15:06 IST)
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస, టీడీపీలు కలిసి పొత్తుపెట్టుకుంటే ఏపీలో అధికారాన్ని జగన్‌కు చంద్రబాబు బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. తెరాసతో టీడీపీ పొత్తు అనేది ఆత్మహత్యతో సమానమని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఒక్కోసారి తీసుకునే అనాలోచిత నిర్ణయాలే తెలంగాణా రాష్ట్రంలో ఇబ్బందులకు కారణమవుతాయంటున్నారు ఆ పార్టీ నేతలు. 
 
పచ్చగా ఉన్న సమైక్య రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలిసిందే. ఇదేవిధంగా చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతల నిర్ణయాలను బాబు కూడా ఫాలో అవుతున్నారా? అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుందంటే గత కొన్నిరోజుల ముందు టీడీపీలోని సీనియర్ నేతలు బాబుతో చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో తెరాసతో కలిసి పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని తెలంగాణా రాష్ట్రంలో కనుమరుగుకాకుండా చేయాలంటే ఇది ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సీనియర్ నేతలు చెప్పిన వాటికి ఒకే అనేశారు బాబు. ముందు నుంచి ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన రేవంత్ పార్టీ మారిపోవడానికి కారణం కూడా ఇదే. పైగా, ఇపుడు తన నిర్ణయాన్ని ప్రశ్నించే వారు లేకపోవడంతో తెరాసతో కలిసిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కేసీఆర్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏపీలో కూడా మూల్యం చెల్లించుకోకతప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు ఏ విధంగా ముందుకు వెళతారన్నది చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పనికిమాలిన పాదయాత్ర అవసరమా : రామకృష్ణ