Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆర్... తెరాస నేత పోట్ల

ముఖ్యమంత్రి కేసీఆర్‌‍, ఆయన సారథ్యంలోని తెరాస ప్రభుత్వ పాలనపై తెరాస సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు తీవ్ర విమర్శలు చేశారు. సచివాలయానికిరాని ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆర్... తెరాస నేత పోట్ల
, శుక్రవారం, 3 నవంబరు 2017 (15:56 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్‌‍, ఆయన సారథ్యంలోని తెరాస ప్రభుత్వ పాలనపై తెరాస సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు తీవ్ర విమర్శలు చేశారు. సచివాలయానికిరాని ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని దుయ్యబట్టారు. ఇలాంటి సీఎం పాలన ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
2015వరకు టీడీపీలో పోట్ల నాగేశ్వరరావు... సీనియర్ నాయకుడిగా పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులను చేపట్టారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరినప్పుడు, ఆయనతో కలసి కారెక్కారు. అయితే, గత కొంతకాలంగా గుర్రుగా ఉంటున్న ఆయన ఇపుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
 
దీంతో ఆయన తెరాస నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇతర నేతలకు స్థానం లేదనీ, ఒకవేళ ఉన్నప్పటికీ.. వారికి ఎదుగుదల అనేది ఉండదన్నారు. అందుకే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి, ఇటీవల ఆ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిల ప్రోత్సాహంతోనే పోట్ల పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని సమాచారం. గత ఐదారురోజులుగా వీరిద్దరితో పోట్ల చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో పోట్లకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలి రిసెప్షన్‌కు వచ్చి వధువుతో పరార్.. పెళ్ళికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది?