Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది'.. వర్మ

'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. లక్ష్మీపార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావును వీడి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిం

'తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది'.. వర్మ
, గురువారం, 26 అక్టోబరు 2017 (06:32 IST)
'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. లక్ష్మీపార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావును వీడి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందనే విషయాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
దీనిపై లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ‘లక్ష్మీస్ వీర గ్రంథం’ ఫస్ట్ లుక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది’ అని వర్మ తనదైన శైలిలో పేర్కొన్నారు. 
 
కాగా, ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి  అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ‘ఎన్టీఆర్ జీవితంలో మొదటి భాగం, ఆఖరి భాగం కాకుండా ఆ మధ్యలో జరిగిన విషయాలను తెరకెక్కిస్తా. ఈ విషయాలు ప్రజలకు తెలియవు. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావుగారు హరికథలు చెప్పుకునేందుకు వాడవాడలా తిరిగారు. 
 
ఇక ఎన్టీఆర్ రెండో భార్యగా ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించారన్న విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. తిరుపతిలోని వెంకన్న సన్నిధిలో ప్రారంభోత్సవం చేసి, నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రను నటి వాణీవిశ్వనాథ్‌ పోషించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో హీరో ఎవరనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. 
 
యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను నిర్మిస్తాం. లక్ష్మీపార్వతి, వీరగంధం సుబ్బారావు గారి జీవిత చరిత్రలను తెలుసుకుంటున్నాం. లక్ష్మీ పార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావుని వదిలి సూట్ కేస్‌తో బయటకు రావడంతో సినిమా మొదలై, ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించడంతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో మూడు పాటలు, హరికథతో పాటు కొన్ని శ్లోకాలు కూడా ఉంటాయన్నారు. 2018లో లక్ష్మీస్ వీరగంధం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని జగదీశ్వర్ రెడ్డి వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి నట సింహానికి కలిసొస్తున్న పేర్లు... ఏంటవి?