Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెరాస ఎమ్మెల్యే బాబూమోహన్ నోటిదూల... తహసీల్దారుపై బూతు పురాణం (Video)

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ మరోమారు తన నోటిదూలను ప్రదర్శించారు. పుల్‌కల్ తహసీల్దారుపై తిట్లదండకం చదివారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertiesment
TRS MLA Babu Mohan
, బుధవారం, 25 అక్టోబరు 2017 (06:54 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ మరోమారు తన నోటిదూలను ప్రదర్శించారు. పుల్‌కల్ తహసీల్దారుపై తిట్లదండకం చదివారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా వెలుగు చూసిన వార్త వివరాలను పరిశీలిస్తే.. 
 
ఈ నెల 20న టేక్మాల్‌ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాబూమోహన్‌ పాల్గొన్నారు. అక్కడి నుంచే ఈ విషయమై తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పుల్‌కల్ మండలంలోని శివంపేట వద్ద ప్రభుత్వ సాధారణ పాలిటెక్నిక్‌ కళాశాల రహదారి ఏర్పాటుకు సర్వే చేయాల్సి ఉండగా తహసీల్దార్‌ సమ్మయ్య చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. 
 
'పాలిటెక్నిక్‌ కళాశాలకు దారి లేదని రెండేళ్లుగా చెబుతున్నాను. ఎల్లుండి హోం మంత్రి, అవతలి ఎల్లుండి డిప్యూటీ సీఎం వస్తుంటే.. ఒక వీఆర్వోను పంపి రోడ్డు చూసి రమ్మంటావా? ఏమనుకుంటున్నావయ్యా? నువ్వెంత.. నీ ఉద్యోగమెంత? డిప్యూటీ సీఎంకు ఏం చెప్పాలి? నిన్ను సస్పెండ్‌ చేయమని చెప్పనా?' అంటూ విరుచుకుపడ్డారు. 
 
అంతేనా, ‘మీరు ఊరకనే ఉద్యోగాలు చేస్తున్నారు. నువ్వు ముందుపొయ్యి అక్కడ ఉండాలి కదా? ఇంజనీర్‌కు చెప్పి పని చేయించాలి కదా? అక్కడే పాలిటెక్నిక్‌ దగ్గర రోడ్డు మీద ఉండు. టేక్మల్‌ నుంచి వస్తున్నా..’ అంటూ బాబూమోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం ఉద్యోగ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భరతమాతకు పూజలతో జనసేన ఆఫీసు ప్రారంభం.. అభిమానితో పవన్ సెల్ఫీ