Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో టీడీపీని బతికించేందుకు బాబు రెడీ: 6న టీఆర్ఎస్‌లోకి కంచెర్ల బ్రదర్స్..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన రే

తెలంగాణలో టీడీపీని బతికించేందుకు బాబు రెడీ: 6న టీఆర్ఎస్‌లోకి కంచెర్ల బ్రదర్స్..
, గురువారం, 2 నవంబరు 2017 (11:57 IST)
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి, ఎనిమిది మంది జిల్లాల అధ్యక్షులు, మరో 20 మంది వరకూ నేతలతో కలసి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. అలాగే రేవంత్ రెడ్డి వెనక వెళ్లడం ఇష్టం లేని కొందరు టీడీపీ నేతలు గులాబీ కుండువా కప్పుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో అందుబాటులో వున్న నేతలతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు గురువారం టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి, తాజా పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ సమావేశానికి పిలిచినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రావాలని ఎల్ రమణ, కృష్ణయ్య తదితర నేతలందరికీ పిలుపులు వెళ్లాయి. 
 
కాగా, ఇదే సమయంలో రేవంత్ రెడ్డి తమకిచ్చిన రాజీనామా లేఖను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు పంపించాలా? వద్దా? అన్న విషయంలోనూ చర్చ సాగనుంది. ఒకవేళ స్పీకర్‌కు లేఖను పంపితే, రాజీనామా చేయకుండా వైకాపా నుంచి టీడీపీలో చేరిన వారి సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉండటంతో ఒకటికి రెండుసార్లు చర్చించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. తమంతట తాము స్పీకర్‌కు లేఖను పంపకుండా, రేవంత్ స్వయంగా మరో లేఖను తీసుకెళ్లి స్పీకర్‌కు ఇచ్చే పరిస్థితి తేవాలన్నది తమ ఆలోచనని టీడీపీ వర్గాల సమాచారం.
 
ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి తెరాసకు జంప్ అయ్యే నేతల సంఖ్య పెరిగిపోతూవస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల ఆరో తేదీన హైదరాబాదులో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు కంచర్ల బ్రదర్స్ సిద్ధమైయ్యారు. కంచర్ల రాకతో నల్లగొండ అసెంబ్లీలో పెను మార్పులు ఖాయమని రాజకీయ పండితులు అంటున్నారు. ఇక ఈ నెల ఆరో తేదీన కేసీఆర్ సమక్షంలో కంచెర్ల బ్రదర్స్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కంచెర్ల టీఆర్ఎస్‌లో చేరితే నల్లగొండ రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంట గ్యాస్ బాదుడు... వచ్చే మార్చి నాటికి సబ్సీడీ ఎత్తివేత