Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాతోనే ఉ.కొరియా గజగజ... అమెరికా-జపాన్ ఆ మాట చెప్పాలి...

ఉత్తర కొరియా అటు అమెరికాతో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలను భయపెడుతూ అణుబాంబు ప్రయోగిస్తామని చెపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పిలిప్ఫీన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ స్పందించారు. అణు యుద్ధంతో కలిగే ప్రయోజనం ఏమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ

చైనాతోనే ఉ.కొరియా గజగజ... అమెరికా-జపాన్ ఆ మాట చెప్పాలి...
, సోమవారం, 30 అక్టోబరు 2017 (18:22 IST)
ఉత్తర కొరియా అటు అమెరికాతో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలను భయపెడుతూ అణుబాంబు ప్రయోగిస్తామని చెపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పిలిప్ఫీన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ స్పందించారు. అణు యుద్ధంతో కలిగే ప్రయోజనం ఏమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ జపాన్, అమెరికా దేశాలతో తమకు ఎలాంటి ముప్పు లేదని ఆ దేశాలు ఉ.కొరియాకు హామీ ఇస్తే ఈ ఉద్రిక్తత తగ్గుతుందని డ్యూటెర్ట్ చెప్పుకొచ్చారు. 
 
భయపెడుతున్న ఉత్తర కొరియా నోరు మూయించాలంటే ఒక్క చైనాతోనే సాధ్యమని ఆయన అన్నారు. చైనా కలుగజేసుకుంటే ఉ.కొరియా గజగజ వణికిపోతుందని అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనను ఎద్దేవా చేస్తూ డ్యూటెర్ట్ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. కానీ త్వరలో ఈ నేతలు ఇద్దరూ సమావేశం కాబోతున్నారు. ఈయన వైఖరికి ఇతర దేశాలు విస్తుబోతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీలో కొంత గందరగోళం వాస్తవమే... యనమల