Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాడెన్ తరహాలో కిమ్ జాంగ్ ఉన్‌ను చంపేందుకు అమెరికా ప్లాన్..

అంతర్జాతీయ ఉగ్రవాది అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినట్టుగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు అమెరికా ప్లాన్ వేసింది. ప్రపంచ దేశాల వినతులను ధిక్కరించి వరుస క్షిపణి ప

లాడెన్ తరహాలో కిమ్ జాంగ్ ఉన్‌ను చంపేందుకు అమెరికా ప్లాన్..
, ఆదివారం, 1 అక్టోబరు 2017 (16:09 IST)
అంతర్జాతీయ ఉగ్రవాది అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినట్టుగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు అమెరికా ప్లాన్ వేసింది. ప్రపంచ దేశాల వినతులను ధిక్కరించి వరుస క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ, అంతర్జాతీయ సమాజంలో అలజడులు రేపుతున్న విషయం తెల్సిందే. ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గాలని ఎంత నచ్చజెప్పినా ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కిమ్ జాంగ్ ఉన్‌ను చంపేయడమే ప్రపంచ దేశాల శాంతికి పరిష్కారం అని అగ్రరాజ్యం భావిస్తున్నట్టు సమాచారం. 
 
కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను కడతేర్చేందుకు అటు అమెరికాలోని రహస్య సాయుధ సేవల బలగాలు, యూఎస్‌ డెల్టా ఫోర్స్‌, దక్షిణ కొరియా కమాండో ఒక యూనిట్‌గా ఏర్పడి కిమ్‌ను చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నాయంట. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఏ క్షణంలోనైనా సియోల్‌ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఎలెక్ట్రోమేగ్నటిక్‌ పల్స్‌ (ఈఎంపీ) దాడికి ఆదేశించే అవకాశం ఉందన్న భయం నేపథ్యంలో ఇక అతడిని చంపడంమే మార్గం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు బలగాలు గగన, ఉపరితల, జల మార్గాల ద్వారా ఏకకాలంలో కిమ్‌ ప్యాలెస్‌పై దాడి చేసి అతడిని హత్య చేయాలని భావిస్తున్నట్లు డెయిలీ స్టార్‌ తెలిపింది. 
 
అయితే, ఓ బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ సీనియర్‌ అధికారి దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారట. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న మిషన్‌ అని, అయితే, అణుయుద్ధం కంటే ఇది మంచి ప్రత్యామ్నాయం అని పరోక్షంగా సమర్థించారు. అంతేకాకుండా, ఉత్తర కొరియా నియంతల ప్యాలెస్‌లోకి చేరుకోవడం అంటే ముమ్మాటికీ కఠినమేనని, మృత్యుకుహరంలోకి అడుగుపెట్టిననే ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఇదే జరిగితే అంతర్జాతీయ న్యాయస్థానంలో చట్టపరంగా చిక్కులొచ్చిపడతాయని కూడా ఆలోచిస్తున్నారంట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...