Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకాను హత్య చేసిందెవరు? సీబీఐ విచారణ కోరిన సునీతా రెడ్డి

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:55 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మూడేళ్ళ క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన వారెవరో తేల్చాలంటూ సీబీఐ విచారణ కోరారు సునీతా రెడ్డి. అయితే, సీబీఐ విచారణ విషయంలో కొంత గందరగోళం తొలుత వినిపించింది. 
 
చంద్రబాబు హయాంలో హత్య జరగ్గా, ఆ హత్యకు చంద్రబాబే కారకుడంటూ వైసీపీ ఆరోపించింది. అప్పట్లో సీబీఐ విచారణ కోరిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదనడాన్ని వివేకా కుమార్తె సునీతా రెడ్డి తప్పు పట్టారు.
 
ఇదిలా వుంటే, ఈ కేసులో నిందితుడు శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా, వివేకా కుమార్తె సునీతా రెడ్డి అనుబంధ పిటిషన్ వేశారు. తనను ఈ కేసులో ఇంప్లీడ్ చేయాల్సిందిగా కోర్టును కోరారు సునీతా రెడ్డి. అయితే, ఏ నిబంధనల ప్రకారం ఇంప్లీడ్ అవుతారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పిస్తానని సునీతా రెడ్డి కోర్టుకు తెలిపారు.
 
కేసు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేయగా, కోర్టుకు సునీతా రెడ్డి ఏం వివరాలు తెలియజేస్తారన్నది సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments