Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్ క్యాలెండర్‌కు నిరసన : సీఎం ఇల్లు ముట్టడికి విద్యార్థుల విఫలయత్నం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (10:33 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ తాడేపల్లిలోని సీఎం జగన్ అధికారిక‌ నివాసం వ‌ద్ద టీడీపీ అనుబంధ విభాగాలు, ప‌లు సంఘాల విద్యార్థులు ఆందోళన చేప‌ట్ట‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 
 
‘చలో తాడేపల్లి’ కార్యక్ర‌మానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువ‌త అక్క‌డ‌కు చేరుకుంటున్నారు. దీంతో పాత టోల్‌గేట్ చౌర‌స్తా వద్ద వారిని పోలీసులు అడ్డుకుంటుండ‌టంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. 
 
ప‌లువురిని పోలీసులు అరెస్టు చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ముఖ్య‌మంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలతో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు మోహరించారు. 
 
ఆదివారం నుంచే పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ విద్యార్థులు వాటిని లెక్క‌చేయ‌కుండా తాడేప‌ల్లి వ‌చ్చారు. గుంటూరు జిల్లాకు వస్తున్న వారిని గుర్తించ‌డానికి పోలీసులు డ్రోన్‌ కెమెరా వాడుతున్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో అతి త‌క్కువ ఉద్యోగాలు పేర్కొన‌డం ఏంట‌ని విద్యార్థులు మండిప‌డుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments