Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏవోబీ బంద్.. అప్రమత్తమైన పోలీసులు

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (09:40 IST)
నేడు మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏవోబీలో ఉద్రిక్తత నెలకొంది. దాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.

ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేడు మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. గత నెల 22, 23న గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలో జరిగిన రెండు ఎదురుకాల్పుల ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఓ మహిళా మావోయిస్టు నాయకురాలు గాయాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఆవిర్భావ వారోత్సవాలు సందర్భంగా సమావేశం నిర్వహించేందుకు వెళ్తుండగా ఏకపక్షంగా కాల్చిచంపారని ఆరోపిస్తూ బంద్​కు పిలుపునిచ్చారు. మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో సీలేరులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విధ్వంస ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే ఏవోబీ సరిహద్దులకు చేరుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, జిమాడుగుల, డుంబ్రిగూడ, పెదబయలు, ముంచింగ్ పుట్ పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు. సీలేరు జ‌ల‌విద్యుత్కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments