ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకీ చప్పుడైంది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు మావోలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి.
విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం గుమ్మిరేవుల వద్ద మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అటవీప్రాంతంలో దాదాపు 20 నిమిషాలపాటు తుపాకుల శబ్దాలు వినిపించాయి. నిన్నటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మవోలు మృతి చెందారు. మరి కొందరు అడవిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసు బలగాలకు.. మావోయిస్టులు తారసపడిన సందర్భంలో.. మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొన్ని ఆయుధాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిన్న మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు అటవీ ప్రాంతం నుంచి రహదారి మార్గానికి తీసుకువచ్చారు. వారిని చత్తీస్‌గఢ్‌కు చెందిన అజయ్, బుద్రి, బిమ లుగా గుర్తించారు. ఈ మృతదేహాలకు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది