Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (17:59 IST)
కాకినాడలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ (కుడా) ప్రమాణ స్వీకారోత్సవంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వేదికపై కూర్చొన్న కూటమి నేతలంతా కిందపడిపోయారు. వీరిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. 
 
కుడా చైర్మన్‌గా తుమ్మల బాబును ప్రభుత్వం నియమించింది. దీంతో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప, జనసేన పార్టీ నేతలు పంతం నానాజీ, హరిప్రసాద్‌ తదితరులు ఆశీనులయ్యారు. 
 
అయితే, వేదికపైకి ఎక్కువ మంది రావండతో వేదిక ఒక్కసారిగా కుప్పుకూలింది. యనమల తదితరులు కిందపడిపోయారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవండతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments