Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

Advertiesment
Chandra babu

ఠాగూర్

, ఆదివారం, 15 డిశెంబరు 2024 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరజీవి వర్థంతి వేడుకలను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీలో త్వరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో తాము నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు జిల్లా మార్చామని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. 
 
నాటు పొట్టి శ్రీరాములు బలిదానంతోనే రాష్ట్రంలో భాషా సంయుక్త రాష్ట్రాల అవతరణకు బీజం పడిందని చెప్పారు. ఆ మహనీయుడ ప్రాణ త్యాగంతోనే తెలుగు రాష్ట్రం అవతరించిందన్నారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మత్తం నింపాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)