Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూసుకుంటున్న శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (14:47 IST)
ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గడంతో, సోమవారం ఉదయం వరకూ తెరచుకుని ఉన్న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. నిన్నటివరకూ 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రాగా, 10 గేట్లను తెరచిన అధికారులు, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 5 గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. 
 
ఎగువ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్న కారణంగా గేట్లను మూసివేసినట్టు తెలిపారు. వస్తున్న నీటిలో కొంతభాగాన్ని రిజర్వాయర్‌ను నింపేందుకు, ఇతర కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా తరలింపునకు వాడుతున్నామని వెల్లడించారు. 
 
కాగా, 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉండే రిజర్వాయర్ లో ప్రస్తుతం 882.70 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇది 202.96 టీఎంసీలకు సమానం. ఇదిలావుండగా, సాగర్ నుంచి వచ్చే నీటిని బట్టి, గేట్ల మూసివేతపై నేటి సాయంత్రం లేదా రేపు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments