Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (18:46 IST)
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.
 
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి 12 గంటల వరకు శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.
 
న‌వంబ‌రు 23న‌ శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి హోమం
న‌వంబ‌రు 23వ తేదీ సోమ‌‌వారం శ్రీ ద‌క్షిణ‌మూర్తిస్వామివారి హోమం జ‌రుగ‌నుంది.  ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments