Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ధాన్యం కొనుగోలుకు చకచకా ఏర్పాట్లు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:23 IST)
దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులకు మద్దతు ధర కల్పించి రబీలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని జిల్లా స్ధాయి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. 

లాక్‌డౌన్‌ నేపధ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఇప్పటికే పౌరసరఫరాల సంస్ధ అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1280 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.

తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోతల సమయాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.  75 రోజుల వరకూ ఈ కేంద్రాలు తెరిచే ఉంటాయి. చిత్తూరు జిల్లాలో 16, నెల్లూరులో 179, పశ్చిమగోదావరి జిల్లాలో 65 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
 
* సాధారణ రకం ధాన్యం క్వింటాలుకు రూ. 1,815, గ్రేడ్‌ ఏ రకానికి రూ. 1,835గా ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది
* ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని ధర కంటే బయట మార్కెట్‌లో ఎక్కువ ధర ఉంటే రైతులు ఎక్కడైనా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు
* స్వయం సహాయక, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల ఆధ్వర్యంలో 
ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు
* రబీ సీజన్‌లో దాదాపు 32 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలుకు సిద్ధమైన పౌరసరఫరాల శాఖ
* ఖరీఫ్‌లో 48.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
* ప్రజాపంపిణీ వ్యవస్ధ, ఇతర సంక్షేమ పధకాల కోసం బియ్యం సరఫరా చేసేందుకు ఖరీఫ్‌ సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా 48.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది
* ఇప్పటివరకు రూ. 8,754 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు
* ఇందులో రూ.8,644 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా మిగిలిన రూ. 110 కోట్లు త్వరలో రైతుల బ్యాంకు అకౌంట్లకు జమకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments