Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఛాయ్‌కి భలే డిమాండ్.. రోజుకు 600 కప్పులు సేల్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:16 IST)
Tea
కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఆఖరికి ఛాయ్ తాగాలంటే కూడా జనాలు జడుసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకు చెక్ పెట్టే ఛాయ్‌ని అమ్ముతున్నాడు.. హన్మకొండలోని ఓ హోటల్‌ యజమాని. వేడి వేడి ఈ టీతో కస్టమర్లను లాగేస్తున్నాడు. 
 
ఈ చాయ్‌ తాగడం వలన గొంతులో ఉపశమనం కలుగుతుందని ఓరుగల్లు వాసులు చెబుతున్నారు. గతంలో 50 చాయ్‌లు అమ్మడం గగనమయ్యేదని.. కాని ఇప్పుడు రోజుకు దాదాపు 600 స్పెషల్‌ చాయ్‌లు అమ్ముతున్నట్టు హోటల్‌ యజమాని చెబుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని రామ్‌నగర్‌లో చిరుధాన్యాలతో తయారు చేసే టిఫిన్లు విక్రయించే ధ్యాన ప్రకృతి మందిరమిది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ చేసే చాయ్‌కు డిమాండ్‌ ఎక్కువే. ఎందుకంటే ఇక్కడ అమ్మేది కరోనా స్పెషల్‌ చాయ్‌ కాబట్టి. 
 
కరోనా వైరస్‌ దరిచేరకుండా ఇప్పుడు అందరూ కషాయం తాగుతున్నారు. ఇదే తన వ్యాపార సూత్రంగా మలచుకుని అల్లం, మిరియాలు, శొంఠి, దాల్చినచెక్కతో తయారు చేసిన వేడివేడి టీతో ఇక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాడు ఈ వ్యాపారి. 
 
ఒక్కో ఛాయ్‌ను రూ.10ల చొప్పున విక్రయిస్తూ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉపాధి పొందుతున్నాడు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రతతో చాయ్‌ను తయారు చేస్తున్నానని యజమాని చెప్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments