Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ మాట్లాడాలి.. గుండె రగిలిపోతుంది..

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:04 IST)
బీజేపీ నేతలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మంగళవారం నిర్వహించే ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలని స్పీకర్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ బీజేపీ నేతలు మాట్లాడాలని స్పీకర్ గుర్తు చేశారు.
 
విశాఖ ప్లాంట్‌కు గురించి ప్రధాని మోదీకి చెప్తే.. అందరం సంతోషిస్తామన్నారు. అదేవిధంగా రైల్వే జోన్, ప్రత్యేక హోదా గురించి కూడా బీజేపీ నేతలు మాట్లాడాలని స్పీకర్ సూచించారు. ఎందరో నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం నాయకులు ప్రాణాలు అర్పించారని అన్నారు. ఏ వ్యక్తినో.. పార్టీలనో కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని.. ఏ కారణాలతో విభజన హామీలు నెరవేర్చలేకపోయారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని స్పీకర్ అన్నారు.
 
విద్యార్థి నాయకుడిగా పనిచేసిన తన గుండె రగిలిపోతుందని ఆయన ఫైర్ అయ్యారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తాను ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నానని.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కచ్చితంగా మాట్లాడాలని అన్నారు. మహానీయుల త్యాగాలు ప్రయివేటైజ్ చేయటానికా సభ అంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments