Webdunia - Bharat's app for daily news and videos

Install App

44 ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (11:37 IST)
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జూన్ ఒకటో తేదీ నుంచి 44 వారాంతపు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు ఈ వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపనుంది. మొత్తం 44 ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంది. వీటిలో విశాఖపట్టణం - బెంగుళూరు ప్రాంతాల మధ్య జూన్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఆదివారం, తిరుగు ప్రయాణంలో బెంగుళూరు నుంచి విశాఖపట్టణంకు ప్రతి సోమవారం నడుపుతారు. 
 
అదేవిధంగా విశాఖపట్టణం - తిరుపతి ప్రాంతాల మధ్య మధ్య జూన్ 4వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ప్రతి బుధవారం, తిరుపతి నుంచి విశాఖపట్ణంకు జూన్ 5 నుంచి జూలై 15వ తేదీ వరకు ప్రతి గురువారం, విశాఖపట్టణం నుంచి చర్లపల్లి మధ్య జూన్ 6వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు శుక్రవారం, చర్లపల్లి నుంచి విశాఖపట్టణంకు జూన్ 6వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments