Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా పండుగ నాడు తెదేపాలోకి 'సూరీడు'?

సూరీడు.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు. చిన్నతనంలో వైఎస్ఆర్ వద్ద చేరిన సూరీడు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరైపోయారు. తన కుమారుడు జగన్, కుమార్తె షర్మిళ, భార్య విజయమ్మలతో తక్కువ సేపు వైఎస్ఆర్ ఉండేవారు కానీ సూరీడు మాత్రం 24 గంటలూ ఆయన్నే అంటిపెట్టుకుని ఉం

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (13:57 IST)
సూరీడు.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు. చిన్నతనంలో వైఎస్ఆర్ వద్ద చేరిన సూరీడు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరైపోయారు. తన కుమారుడు జగన్, కుమార్తె షర్మిళ, భార్య విజయమ్మలతో తక్కువ సేపు వైఎస్ఆర్ ఉండేవారు కానీ సూరీడు మాత్రం 24 గంటలూ ఆయన్నే అంటిపెట్టుకుని ఉండేవారు. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ మరణం తరువాత కనిపించకుండా పోయారు. అంతేకాదు... వై.ఎస్. బతికున్న సమయంలో అంతోఇంతో ఆస్తులు చేర్చుకున్నట్లు ఆరోపణలు కూడా సూరీడుపై ఉన్నాయి.
 
అయితే అలాంటి సూరీడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళనున్నారు. ఆయన పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైంది. వై.ఎస్.ఆర్ మరణం తరువాత కొంతమంది నేతలతో పడుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి సూరీడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సూరీడు ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారట. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో నేరుగా చర్చలు జరిపిన సూరీడు దసరాకు ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైఎస్ఆర్‌కు రాజకీయ శత్రువు చంద్రబాబు. అలాంటి వ్యక్తి చెంత సూరీడు చేరడం ఏమిటో ఇప్పటికే వైఎస్ఆర్ సన్నిహితులకు అర్థం కాని ప్రశ్నలా మారిపోయింది. కానీ సూరీడు మాత్రం కేవలం రాజకీయంగా కొంతమంది నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తప్పించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments