Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది.. : విత్తమంత్రి భర్త పరకాల ప్రభాకర్

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:41 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ భర్త, ప్రముఖ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ దేశ ఆర్థిక రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను అంగీకరించకపోగా వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. పైపెచ్చు, మాజీ ప్రధానులు వీవీ నరసింహా రావు, డాక్టర్ మన్మోహన్ సింగ్‌ల ఆర్థిక విధానాలే బాగున్నాయని తెలిపారు. 
 
మందగమనంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ఎన్ని 'ఉద్దీపన' చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందన్నారు. కానీ, వాస్తవాలను కేంద్రం అంగీకరించడం లేదన్నారు. గతంలో దేశ ప్రధానులుగా చేసిన పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్‌ల హయాంలోనే దేశ ఆర్థిక విధానాలు బాగున్నాయని కొనియాడారు. 
 
ఇదిలావుంటే, తాజాగా ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. 
 
గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన 6.8 శాతంతో పోల్చినా ఇది 0.8 శాతం తక్కువ. పైగా, వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments