'దివానోస్ పేకాట క్లబ్' పేరుతో హీరో మహేష్ బాబు చెల్లికి శిల్పా చౌదరి టోకరా

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (08:59 IST)
కిలేడీ శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. పలువురు సెలెబ్రిటీలను మోసం చేసిన ఈమె కోట్లు దండుకున్నారు. ఇలాంటివారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని కూడా ఉన్నారు. ఈమె వద్ద రూ.2 కోట్ల మేరకు శిల్పాచౌదరి టోకరా పెట్టినట్టు తెలుస్తోంది. 
 
హైదరాబాద్ నగరం, గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసం ఉంటూ వచ్చిన శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ అనే దంపతులు దివానోస్ పేరుతో ఓ పేకాట క్లబ్‌ను ప్రారంభించారు. పైగా, కోటీశ్వరులుగా తమను తాము పరిచయం చేసుకున్నవీరు టీవీ, సినీ నిర్మతలుగా నమ్మించారు. అలా అనేక మంది సినీ ప్రముఖులను కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించేవారు. 
 
ఆరంభంలో అతి తక్కువ మందితో కిట్టీపార్టీ మొదలుకాగా, ఆ తర్వాత ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకాట క్లబ్బుగా మార్చేశారు. ఇందులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దాదాపు 100 మంది వరకు సెలెబ్రిటీల కుటుంబాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, శిల్పా చౌదరి దంపతుల చేతిలో మోసపోయినట్టు గ్రహించిన ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి కూపీలాగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments