Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నను వేటాడి.. వెంటపడి విషపు కాటు వేసే చెల్లెమ్మ షర్మిల : విజయసాయిరెడ్డి

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (10:03 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసమే శత్రువులతో కలిసి ఆయన సోదరి వైస్ షర్మిల కుట్ర పన్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆరోపించారు. శత్రువులతో కలిసి జగన్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా, వైఎస్ఆర్ మృతికి కారణమైన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం అత్యంత బాధాకరమన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయించేందుకు ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, షర్మిల ఆస్తి తగాదా కాదని, అధికారం కోసం తగాదా అని అన్నారు. శత్రువులకు మేలు చేసేందుకు సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్లను తానెక్కడా చూడలేదన్నారు. వైఎస్ చనిపోవడానికి కారకులెవరో గుండెపై చేయి వేసుకుని చెప్పాలని షర్మిలను డిమాండ్ చేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని అంటున్నారని.. దీనికి వంద శాతం కారణం షర్మిల కాదా అని ప్రశ్నించారు. 
 
షేర్ సర్టిఫికెట్లు లేకుండా, అన్న సంతకాలు లేకుండా, గిఫ్ట్ డీడ్ లేకుండా, దొంగ సంతకాలతో ఎలా షేర్లు బదిలీ చేసుకున్నారని అడిగారు. 'మీరు ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు..? ఆ కన్నీళ్లకు విలువ లేదు.. వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది' అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఎజెండా ప్రకారం జగన్‌ను జైలుకు పంపించేందుకు షర్మిల, ఆయన ఒక్కటయ్యారని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్, షర్మిల మధ్య జరి గిన అన్ని విషయాలూ తనకు తెలుసని, ఇప్పటికైనా చంద్రబాబుతో కలిపిన చేతులు విడదీయాలని సూచించారు. ఈ ఎపిసోడ్‌కు ఇంతటితో ముగింపు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments