Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూజా ఖేడ్కర్ తండ్రి పోటీ

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (09:17 IST)
ఐఏఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ తండ్రి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ కూడా వివాదాస్పదమైంది. తప్పుడు ధృవపత్రాలను సమర్పించి సివిల్స్ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన పూజా ఖేడ్కర్‌ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసిన విషయం తెల్సిందే. 
 
తాజాగా ఆమె పేరు మరోమారు వార్తల్లో నిలిచింది. పూజా తండ్రి దిలీప్ ఖేడ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన అహ్మద్ నగర్ దక్షిణ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 
 
అయితే, ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ వివాదాస్పదమైంది. తాను భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన నామినేషన్ వేయగా, అపుడు తాను భార్యతో కలిసే ఉంటున్నట్టు పేర్కొనగా, ఇపుడు మాత్రం విడాకులు తీసుకున్నట్టు పేర్కొనడంతో అఫిడవిట్ వివాదాస్పదమైంది. 
 
దీంతో నెటిజన్లు పలు రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. కుమార్తె మాత్రమే కాదు తండ్రి కూడా తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించడంలో ఘనుడు అంటూ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments