న్యాయం కోసం వస్తే లైంగిక వేధింపులా? క్రిమినల్ కేసు పెట్టండి... బాబు ఆగ్రహం

న్యాయం కోసం వచ్చిన మహిళపై వాయల్పాడు సీఐ తేజోమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజోమూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తనకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడంపై సంయుక్త అనే యువతి పోలీసులన

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (14:10 IST)
న్యాయం కోసం వచ్చిన మహిళపై వాయల్పాడు సీఐ తేజోమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజోమూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తనకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడంపై సంయుక్త అనే యువతి పోలీసులను ఆశ్రయించగా కంచె చేను మేసిన చందంగా ఆమెపై కన్నేశాడు సీఐ తేజోమూర్తి.


న్యాయం చేయాలంటే తన కోర్కె తీర్చాలంటూ కండిషన్ పెట్టాడు. గరుడసేవ నాడు తను తిరుమల కొండపై వుంటాననీ, నువ్వు వస్తే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని ఫోనులో తెలిపాడు. ఈ వ్యవహారాన్నంతా బాధిత మహిళ మీడియా ముందు ప్రవేశపెట్టింది.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలు డ్యూటీలో ఉండగా మరోపక్క రాసలీలలు కోసం తహతహలాడిపోయిన వాయల్పాడు సిఐ సిద్ద తేజోమూర్తిని లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. పవిత్ర పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా గరుడసేవ రోజు తిరుమలకు రావాలని ఏకాంతంగా గడుపుదామంటూ బాధిత మహిళ సంయుక్తను సిఐ పలుమార్లు ఫోన్ చేశాడు.
 
న్యాయం కోసం స్టేషనుకి వెళితే గడిచిన నెలరోజుల నుంచి లైంగికంగా హింసిస్తున్న సిఐ తేజోమూర్తిని రెడ్ హ్యడిండ్‌గా పట్టివ్వటానికి ప్రయత్నించింది సంయుక్త. వివిధ మహిళా సంఘాలు సహాయంతో పక్కా ప్లాన్ చేసింది. విషయం తెలుసుకున్న సిఐ అక్కడి నుండి పారిపోవడంతో బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించింది.
 
సిఐతో తను వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌తో పాటు పోన్ కాల్ రికార్డును కూడా బహిర్గతం చేసింది. తనలా మరొకరికి అన్యాయం జరగరాదని కోరుకుంది. పవిత్ర బ్రహ్మోత్సవాల్లో డ్యూటీ చేస్తూ పోలీస్ అధికారి ఇటువంటి పాడుపని చేయడం ఏంటని పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం