Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరు వ‌ర్షంలో... గ‌రిక‌పాడులో పోలీస్ అధికారుల సేవ‌!

Webdunia
గురువారం, 22 జులై 2021 (20:40 IST)
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు గ‌రిక‌పాడు చెక్ పోస్ట్ వ‌ద్ద అందిస్తున్న సేవ‌లు మంచి గుర్తింపునిస్తున్నాయి. ఇక్క‌డి పోలీసు అధికారులు చేసే విధి నిర్వహణ చూస్తే ముచ్చటేస్తుంది. జోరున వర్షం పడుతున్నా, ఎవ‌రికైనా క‌ష్టం అని తెలియగానే కాసేపు కూడా ఆలస్యం చేయకుండా వచ్చిన పోలీసులు త‌మ సేవ‌ల్ని అందిస్తున్నారు. 
 
జోరున వర్షం లో సైతం గరికపాడు చెక్ ఫోస్ట్ సమీపంలో జరిగిన రొడ్డు ప్రమాదం గురించి తెలుసుకొని జగ్గయ్యపేట సి.ఐ చంద్రశేఖర్, చిల్లకల్లు ఎసై దుర్గాప్రసాద్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని భాదితులను ఆస్పత్రికి తరలించిన సంఘటన చూసిన తర్వాత మానవత్వం అంటే తెలుస్తుంది..
 
వర్షం వస్తోందని, ప్రమాదం జరిగినా చూడడానికి రోడ్డు మీదకు ఎవ‌రూ రాని పరిస్థితి లో సైతం, కుటుంబాన్ని వదిలి అర్ధరాత్రి జోరున వర్షంలో తడుస్తూ కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలని వచ్చిన ఆ పోలీసు అధికారుల‌ మానవత్వానికి, క‌ర్తవ్య దీక్ష‌కు హ్యాట్సాఫ్.. అధికారులు మ‌రీ అంత‌గా ఒక వేళ కావాలంటే, కింద స్థాయిలో ఉన్న అధికారులను పంపించవచ్చు... పని చేయించవచ్చు. కానీ ఉన్న‌తాధికారి తనే ఆ సమయంలో సైతం రావడం నిజంగా గొప్ప విషయం అని స్థానికులు కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments