Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధానిపై అభిప్రాయాలు పంపండి

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (08:13 IST)
ఏపీ రాజధాని, ఇతర ప్రాజెక్టులపై ప్రజల నుంచి వినతులు నిపుణుల కమిటీ ఆహ్వానించింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, అమలు తీరు..రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనలు ఇవ్వాలని కోరింది.

ఆ సూచనలను ఈమెయిల్ expertcommittee2019@gmail.com లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సూచించింది. నవంబర్‌ 12లోగా ఈ మెయిల్‌ లేదా పోస్ట్‌ ద్వారా పంపాలని సూచించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి గడిచిన మూడు నెలలుగా గందరగోళం నెలకొంది.

అసలు రాజధానిని అమరావతిలో కొనసాగిస్తారా..? లేక వేరే ప్రాంతానికి తరలిస్తారా..? అన్న అంశం అన్ని వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అదే విధంగా ప్రాజె క్టుల్లో అవినీతి చోటుచేసుకుందని ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతూ ప్రజాధనాన్ని ఆదా చేసే పనిలో ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మో హన్‌ రెడ్డి రాజధాని నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టులపై అధ్యాయనం చేసేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌.రావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీని సెప్టెంబరు 13న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీ సోమవారం అమరావతి నిర్మాణం, ఇతర పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రజల సూచనలను, అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ పట మటలో ఉన్న తమ కార్యాలయానికి నవంబరు 12లోపు ప్రజలు, ఇతర ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలను పంపించాలని సూచించింది.

తమ తమ అభిప్రాయాలను మెయిల్‌ ద్వారా గానీ, లేఖల రూపంలో పంపించవచ్చని వెల్ల డించింది. ప్రజల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ కమిటీ తన నివే దికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తరువాత దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments