Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం పేరును కూడా మార్చేసిన వైకాపా ప్రభుత్వం

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:41 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన సీతకొండలోని వ్యూపాయింట్‌కు గత టీడీపీ ప్రభుత్వం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి డాక్టర్ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పేరు పెట్టింది. ఇపుడు ఈ పేరను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చింది. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "భారత రత్న" అబ్దుల్ కలాంకు ఇది తీరని అవమానమని వ్యాఖ్యానించారు. అలాగే, ఈ వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేసిన స్వచ్ఛంద సంస్థ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము అభివృద్ధి చేసిన పేరు పెట్టిన ప్రాంతానికి మీరు ఎలా పేరు మారుస్తారంటూ సూటిగా ప్రశ్నించింది. 
 
వైజాగ్ నగరంలో ఇటీవల జీ20 సందస్సు జరిగింది. ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు సీతకొండ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌కు గత నెలలో ఆమోదం లభించింది. తాజాగా 150 మీటర్ల పరిధిలోని సుందరీకరణ పనులు పూర్తి చేసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ స్థానంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని అక్షరాలు చెక్కించారు.
 
ఈ పేరు మార్పుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు మార్చడం మానసిక శాడిజానికి ప్రతీక అని దుమ్మెత్తి పోస్తూ వ్యూ పాయింట్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, పారదర్శకతకు అబ్దుల్ కలాం మారుపేరని, ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఆయనను పేరు మార్పు ద్వారా అవమానించారంటూ మండిపడ్డారు. కాగా, వ్యూపాయింట్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టి అభివృద్ధి చేసింది తామేనని ఇపుడు తాను పేరును మార్చడం సరికాదని వైజాగ్ వలంటీర్స్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments