Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంబర్ ప్లేటు లేకుండా షోరూం నుంచి బయటకు వచ్చిన స్కూటర్... రూ.లక్ష ఫైన్

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (11:26 IST)
కొత్త మోటారు వాహనం చట్టం 2019తో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఈ చట్టంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పైగా, ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ చట్టాన్ని అడ్డుగా పెట్టుకుని ఇష్టానుసారంగా అపరాధాలు వసూలు చేస్తున్నారు. ఏ ఒక్క పత్రం లేకపోయినా, చివరకు వెనుక కూర్చొనే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోయినా రూ.వెయ్యి అపరాధం విధిస్తున్నారు. 
 
తాజాగా భువనేశ్వర్ ట్రాఫిక్ పోలీసులు వార్తల్లో నిలిచారు. ఒక కొత్త స్కూటరుకు దాని ఖరీదు కన్నా అధికంగా జరిమానా విధించి చరిత్ర సృష్టించారు. భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్‌ను కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారు. స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీంతో ఆర్టీవో సంబంధిత వాహన డీలర్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు. 
 
అంతేకాకుండా భువనేశ్వర్ ఆర్టీవో అధికారులు ఆ డీలర్‌షిప్‌నకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తామన్నారు. అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేశారని డీలర్‌ను ప్రశ్నించారు. కొత్త వాహనం డెలివరీ చేసే సమయంలోనే కొత్త మోటారు వాహన చట్టం కింద వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబరు, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. వీటిని వాహనాన్ని అప్పగించే ముందు కొనుగోలుదారునికి డీలర్ అందజేయాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments