Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌... ఉద్యమ సమర క్రాంతి సంబరాలు

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (15:11 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతిలో సంక్రాంతిని ఉద్య‌మంతో క‌ల‌గ‌లిపి చేస్తున్నారు. పండుగ సందర్భంగా ఉద్యమ సమర క్రాంతి పేరుతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తుళ్ళూరు శిబిరం వద్ద సంబరాలను ఏర్పాటు చేశారు. 
 
 
ఆంధ్రుల సమర క్రాంతిలో భాగంగా రాజ‌ధాని రైతులు వంటా వార్పు నిర్వహించారు. ఉద్యమ గాలి పటాలు, అమరావతి ఆకుపచ్చ బెలూన్ లు గాలిలోకి ఎగుర‌వేసి సంక్రాంతి ఉద్య‌మ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు శిబిరం వద్దకు భారీగా తరలివచ్చారు.
 
 
బెలూన్లు ఎగరవేసిన రాజధాని రైతులు, సమర సంక్రాంతి పేరిట వినూత్న నిరసన తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు పొంగళ్లు పెట్టారు. సేవ్‌ అమరావతి - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని బెలూన్లపై రాసి వాటిని గాల్లోకి ఎగురవేశారు. అమరావతిపై దుష్ప్రచారాలను నిరసిస్తూ గాలి పటాలు ఎగరవేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పండగలూ రోడ్డుపైనే చేసుకోవాల్సి వస్తోందని రాజధాని రైతులు వాపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments