Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు బైకుల ఢీ: చిత్తూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Advertiesment
రెండు బైకుల ఢీ: చిత్తూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
, శనివారం, 15 జనవరి 2022 (14:30 IST)
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఇస్మాయిల్ (21), సిద్ధిక్ (21) అనే ఇద్దరు స్నేహితులు శుక్రవారం (జనవరి 15) రాత్రి మదనపల్లె నుంచి చంతపర్తి గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో ఓ చోట ఎదురుగా మరో బైక్ దూసుకురాగా రెండు బైక్స్ ఢీకొన్నాయి. 
 
ఈ ప్రమాదంలో ఇస్మాయిల్, సిద్ధిక్‌తో పాటు శ్రీనివాసులు (40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి 108 అంబులెన్స్‌కి సమాచారమిచ్చారు.
 
దీంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని... వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మార్గమధ్యలోనే మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

య‌ధేచ్ఛ‌గా కోడి పందాలు, గుండాట‌! అధికారం మాది...త‌గ్గేదేలా!