Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ కార్యాలయంలో 'సాక్షి' పత్రిక ఫోటోగ్రాఫర్... కెమెరామెన్

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (08:45 IST)
ఏపీ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కార్యాలయంలో ఏపీ అధికార పార్టీ వైకాపాకు చెందిన సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్, సాక్షి టీవీ కెమరామెన్ ప్రత్యక్షమయ్యారు. ఫొటోగ్రాఫర్‌ పేరు ఎస్‌.లక్ష్మీపవన్‌, సాక్షి టీవీ ఛానల్‌ కెమెరామెన్‌ పేరు. సత్య. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలను గృహనిర్బంధాలు చేసి చంద్రబాబును అరెస్టు చేసిన సిట్‌ అధికారులు మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబును ఇలా సాక్షి పత్రిక, ఛానల్‌కు చెందిన సిబ్బంది సమక్షంలో విచారణ చేయడంలో మర్మమేమిటి అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి కేవలం సాక్షి పత్రిక, టీవీకి చెందిన వారిని మాత్రమే ఆహ్వానించడానికి గల కారణాలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరు చేసిన సీఐడీ 
 
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగినట్టు ఆరోపించి ఏపీ సీఐడీ పోలీసులు.. కొద్దిసేపటి క్రితమే తెదేపా అధినేత చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో చంద్రబాబుతో పాటు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును చేర్చింది. 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. తాజాగా ఇప్పుడు చేర్చడం గమనార్హం. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత ఓపెన్‌ కోర్టులో వాదనలు వినాలని తెదేపా లీగల్‌ టీమ్‌ విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. మరోవైపు ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
మరోవైపు, చంద్రబాబు అరెస్టుపై సామాజిక మాధ్యమ వేదికగా పెద్దఎత్తున నెటిజన్ల నుంచి నిరసన వ్యక్తమైంది. 'చంద్రబాబునాయుడు', ఆయనకు తోడుగా నిలుస్తామంటూ 'వి విల్‌ స్టాండ్‌ విత్‌ సీబీఎన్‌ సర్‌', 'స్టాప్‌ ఇల్లీగల్‌ అరెస్ట్‌ ఆఫ్‌ సీబీఎన్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌లు శనివారం ట్విటర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో కొనసాగాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ.. ఆయన నాయకత్వాన్ని చాటుతూ అనేక సందేశాలు పోస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments