స్కిల్ కేసులో రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరు చేర్చిన సీఐడీ

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (08:37 IST)
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగినట్టు ఆరోపించి ఏపీ సీఐడీ పోలీసులు.. కొద్దిసేపటి క్రితమే తెదేపా అధినేత చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో చంద్రబాబుతో పాటు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును చేర్చింది. 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. తాజాగా ఇప్పుడు చేర్చడం గమనార్హం. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత ఓపెన్‌ కోర్టులో వాదనలు వినాలని తెదేపా లీగల్‌ టీమ్‌ విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. మరోవైపు ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
మరోవైపు, చంద్రబాబు అరెస్టుపై సామాజిక మాధ్యమ వేదికగా పెద్దఎత్తున నెటిజన్ల నుంచి నిరసన వ్యక్తమైంది. 'చంద్రబాబునాయుడు', ఆయనకు తోడుగా నిలుస్తామంటూ 'వి విల్‌ స్టాండ్‌ విత్‌ సీబీఎన్‌ సర్‌', 'స్టాప్‌ ఇల్లీగల్‌ అరెస్ట్‌ ఆఫ్‌ సీబీఎన్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌లు శనివారం ట్విటర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో కొనసాగాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ.. ఆయన నాయకత్వాన్ని చాటుతూ అనేక సందేశాలు పోస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments